దోహా - లండన్ డైరెక్ట్ బ్రిటిష్ ఎయిర్ వేస్ సర్వీస్
- May 13, 2016
తొలిసారిగా బ్రిటిస్ ఎయిర్‌వేస్ ఖతార్‌కి డైరెక్ట్ సర్వీసుల్ని నడపనుంది. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్‌కి ఈ విమానం నడవనుంది. ఈ ఏడాది అక్టోబర్ 31 నుంచి బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఖతార్ రాజధాని దోహా నుంచి లండన్ హీత్రూకి డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇక నుంచి దోహా - లండన్ మధ్య ప్రయాణం చేసేవారు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మీదుగా వెళ్ళాల్సిన పని ఉండదు. ఇందుకోసం వినియోగించే బోయింగ్ 777 విమానంలో నాలుగు క్యాబిన్లు ఉంటాయి. ఫస్ట్, క్లబ్ వరల్డ్ (బ్రిటిష్ ఎయిర్ వేస్ బిజినెస్ క్యాబిన్), వరల్డ్ ట్రావెలర్ ప్లస్, వరల్డ్ ట్రావెలర్ (ఎకానమీ క్యాబిన్) ప్రయాణీకులకు సేవలందించనున్నాయి. బ్రిఇష్ ఎయిర్ వేస్ మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా హెడ్ పాలో డెరెంజిస్ మాట్లాడుతూ, ఖతార్ రూట్ స్థిర అభివృద్ధి నమోదు చేస్తోందనీ, డైరెక్ట్ సర్వీసు ద్వారా ప్రయాణ సమయాన్ని ఏడు గంటల 20 నిమిషాల వరకూ తగ్గిస్తుందని వివరించారు. ఈ సర్వీసు ఇరు దేశాల మధ్యా సంబంధాల్ని మరింత పొంపొందించగలదని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







