' సంజోష్ ఆడియో ఆల్బమ్ లాంచ్ '
- May 13, 2016ACS ఎంటర్ టైన్మెంట్ తగరం అంకయ్య చిన్నక్క సమర్పణలో సంగీత దర్శకుడు సంజోష్ సంగీత సారధ్యంలో రూపోందిన ‘సంజోష్ మ్యూజిక్ అల్బమ్ ఆవిష్కరణ హైద్రాబాద్ ఫిల్మ్ చాంబర్ లో జరిగింది.మహేష్ నిర్మించిన ఈ ఆడియో అల్బమ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణా ఫిలిం చాంబర్ అసోసియేషన్ అద్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆడియో సీడిని ఆవిష్కరించి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కు అందజేశారు.ఈసందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ... సంజోష్ గతంలో "సాధన " అనే సినిమా కి మ్యూజిక్ ను అందించాడు. సినిమా అవకాశాలు రాలేదని అదైర్య పడకుండా ఇలాంటి అల్బమ్ లను చేయటం శుభ పరిణామం అన్నారు. మ్యూజిక్ పై పట్టున్న సంజోష్ అల్బమ్ కు మంచి పేరు రావాలని , ఇండస్ట్రీ లో సక్సెస్ ను అందుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు..తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ ... సినిమా అవకాశాల కోసం ఎదురుచూడకుండా ఇలాంటి అల్బమ్ లను చేయటం వలన మంచి పేరు తో పాటు సినిమా అవకాశాలు కూడా వస్తాయి. ఈ అల్బమ్ లో ఫోక్ , క్లాసిక్ పాటలు అందరికీ నచ్చుతాయి. సంజోష్ మాట్లాడుతూ ... సినిమా అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించాను. నా మిత్రుడి సహకారంతో ఈ అల్బమ్ ను రూపొందించాను. ఈ అల్బమ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. దర్శక నిర్మాతలు అవకాశం కలిపిస్తే 1 సిచ్చ్యుయేషన్ కి వంద ట్యూన్స్ కట్టగలనని అన్నారు.. నిర్మాత మహేష్ మాట్లాడుతూ ... చాలా కాలంగా సంజోష్ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు ....అతనిలోని టాలెంట్ చూసి ఈ అల్బమ్ చేయడానికి ముందుకొచ్చానని అన్నారు..భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతాడనే నమ్మకం ఉందని అన్నారు..ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్ , ACS ఎంటర్ టైన్మెంట్ పాల్గోన్నారు.....
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







