జనతా గ్యారేజ్ ఆడియో యూఎస్ లో రిలీజ్..
- May 13, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్నాడు. టెంపర్ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన జూనియర్, తరువాత వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాతో భారీ వసూళ్ల టార్గెట్ ను రీచ్ అయ్యాడు. అదే జోరులో ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా జనతా గ్యారేజ్ ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకంగా మారిన ఓవర్ సీస్ మార్కెట్ లో పట్టు కోసం, జనతా గ్యారేజ్ ఆడియోను అమెరికాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.అయితే గతంలో మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్లు కూడా తమ సినిమా ఫంక్షన్లను అమెరికాలో ప్లాన్ చేసి వెనక్కి తగ్గారు. వన్ నేనొక్కిడినే, శ్రీమంతుడు సినిమాల సమయంలో ఇదే ప్లాన్ చేసిన మహేష్ వర్క్ అవుట్ కాదేమో అన్న ఆలోచనతో వెనకడుగు వేశాడు. మరి ఎన్టీఆర్ ప్లానింగ్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







