తెలంగాణలో కాంగ్రెస్ లో చేరుతున్న 35 మంది జాబితా విడుదల
- June 26, 2023
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. పార్టీలో చేరుతున్న నేతలతో కళకళలాడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర పార్టీలో జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ లో చేరబోతున్న 35 మంది నేతలతో కూడిన లిస్ట్ ఆ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీకి చేరింది. ఈ జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుది కాగా… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు 15వ స్థానంలో ఉంది. మరోవైపు రాహుల్, ఖర్గేలతో పొంగులేటి, జూపల్లిన భేటీ ముగిసింది.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







