దోహాలో మొబైల్ పెట్రోల్ స్టేషన్స్‌కి వినతి
- May 13, 2016
ఖతార్ ఫ్యూయెల్ (వొకోద్) అథారిటీస్, మొబైల్ పెట్రోల్ స్టేషన్లను దోహా సిటీ మరియు శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తోంది. ఫ్యూయల్ స్టేషన్లు తగినన్ని అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాహనదారులు ఫిర్యాదు చేయడంతో ఖతార్ ఫ్యూయల్ (వొకోద్) ఈ నిర్ణయం తీసుకుంది. అతి త్వరలో వీలైనన్ని ఎక్కువ మొబైల్ పెట్రోల్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామనీ, అలాగే ఉన్న పెట్రోల్ స్టేషన్ల సంఖ్యనీ పెంచుతామని అన్నారు. పెట్రోల్ బంకుల వద్ద విపరీతమైన రద్దీతో వాహనదారులు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకున్నామని సంస్థ ప్రతినిథులు తెలిపారు. అల్ తుమామా మరియు మెసైమీర్, అలాగే ఎఫ్-రింగ్ రోడ్ వ్యాప్తంగా పెట్రోల్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని వాహనదారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







