నైజర్ అధ్యక్షుడిని వెంటనే విడుదల చేయాలి: సౌదీ అరేబియా

- July 29, 2023 , by Maagulf
నైజర్ అధ్యక్షుడిని వెంటనే విడుదల చేయాలి: సౌదీ అరేబియా

రియాద్: నైజర్ అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్‌ను వెంటనే విడుదల చేయాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. అధ్యక్ష భవనంలో అధ్యక్షుడిని ఉంచిన కొన్ని గంటల తర్వాత, పశ్చిమ ఆఫ్రికా దేశం జాతీయ టెలివిజన్‌లో బుధవారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. చాలా రోజులుగా నైజర్‌లో రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు అధ్యక్షుడు బజౌమ్ కూలదోసిన సైనిక ప్రభుత్వాన్ని గుర్తించబోమని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. "అధ్యక్షుడిని త్వరగా విడుదల చేయవలసిందిగా.. అతని భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారిస్తూ నేరుగా అతని రాజ్యాంగ అధికారాలను పునరుద్ధరించడానికి వీలు కల్పించాలని మేము తిరుగుబాటు పార్టీలకు పిలుపునిస్తాము" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com