విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు రద్దు..ప్రయాణికుల ఆగ్రహం
- August 17, 2023
విశాఖపట్నం: గురువారం(ఈరోజు) ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ రైలును రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఉదయం గం.5.45కు బయలుదేరాల్సిన రైలును రద్దు చేసినట్టు వివరించారు. అయితే, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 7 గంటలకు మరో రైలును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వందేభారత్ రైలు ఆగే స్టేషన్లన్నింటిలో ఈ రైలు ఆగుతుందని చెప్పారు. ఉదయం 5 గంటల నుంచే రైలు రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు అందజేశామని వివరించారు. కాగా, చివరి నిమిషంలో వందేభారత్ రైలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







