కాకి - పాము కథ
- June 25, 2015
అనగనగా ఒక అడవిలోని ఒక చెట్టు మీద ఒక కాకి జంట గూడు కట్టుకుని ఉండేది. ఆ చెట్టు కింద ఒక పెద్ద పుట్టలో ఒక నాగుపాము ఉండేది. అయితే ఆ చెట్టు మీదున్న కాకి పెట్టిన గుడ్లను ఈ పాము ప్రతిరోజూ చెట్టు మీద కాకి లేని సమయం చూసి తినేస్తూ ఉండేది. పాపం ఆ ఆడకాకి రోజూ మగకాకితో ఈ విషయం మొర పెట్టుకుని ఏడ్చేది. అయితే ఆ మగకాకి ఎలాగైనా ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ పాము బెడద తప్పించుకోవాలని తన స్నేహితుడైన నక్కబావని సలహా అడిగింది. నక్క కాకికి ఒక మంచి సలహా ఇచ్చింది. ఒక రోజు ఆ కాకి ఆ ఊరి రాజుగారి బంగ్లా వద్దకి వెళ్లి అక్కడ రాణిగారు, ఆమె చెలికత్తెలు స్నానం చేస్తున్న సమయం చూసి, అక్కడికి వెళ్ళి వారు స్నానానికని వారి ఒంటి మీద ఉన్న ఆభరణాలను తీసి ఒడ్డున పెట్టి కొలనులోకి దిగడం చూసింది. అప్పుడు కాకి రివ్వున ఎగిరి అక్కడ ఉన్న నగలలో విలువైన రత్నాల హారాన్ని నోట కరుచుకుని, చెలికత్తెలు చూస్తుండగా ఎగురుకుంటూ వచ్చింది. దాని వెనుక రాజభటులు గునపాలతో వెంటబడ్డారు. ఆ కాకి తెలివిగా ఆ రాజభటులకి తన దారి తెలిసేలా అక్కడక్కడ చెట్లమీద వాలుతూ మళ్లీ ఎగురుకుంటూ చివరికి తన గూడు ఉండే చెట్టు మీద వాలింది. దాని వెనుకే అక్కడికి చేరుకున్న రాజభటులు దాన్ని అనుసరించి అక్కడికే చేరుకున్నారు. వారు చూస్తుండగానే ఆ కాకి ఆ రత్నాల హారాన్ని పాము పుట్టలోనికి జారవిడిచి, హాయిగా చెట్టు మీద నిలబడి చోద్యం చూస్తుంది. దాంతో ఆ భటులు గునపాలతో ఆ పుట్టని తవ్వగా, అందులోని నాగుపాము బుస్సున బయటకు వచ్చింది. భటులు తమ వెంట తెచ్చిన గునపాలతో ఆ పాముతలను బద్దలకొట్టి చంపేసి, ఆ హారాన్ని తీసుకెళ్లిపోయారు. కాకి తన ఉపాయం పారి, పాము బెడద తప్పినందుకు ఎంతో సంతోషించి హాయిగా తన గుడ్లను పొదిగి పిల్లల్ని చేసుకుని, పెంచుకోసాగింది.
నీతి: కాకి తన తెలివితో బలవంతమైన పామునే చంపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







