అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకి అర్హుడు కాదా.?
- August 27, 2023
ఇటీవలే సినీ పరిశ్రమ అత్యంత గౌరవంగా భావించే జాతీయ ఉత్తమ అవార్డుల విడుదల జరిగింది. తెలుగు సినీ పరిశ్రమను ఈ సారి జాతీయ అవార్డులు బాగానే వరించాయని చెప్పొచ్చు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి వివిధ కేటగిరీల్లో ఆరు అవార్డులు దక్కగా, మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు దక్కించుకుంది. అలాగే, వైష్ణవ్ నటించిన రెండో సినిమాకి బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో జాతీయ అవార్డు దక్కింది.
ఇక, ముఖ్యంగా ఇంతవరకూ ఏ సౌత్ ఇండియా నటుడికీ దక్కని జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అల్లు అర్జున్‌కి దక్కింది ‘పుష్ప’ సినిమాకి గాను.
ఇదే ఇప్పుడు సౌత్ సినిమాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమ ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. ఆ మాటకొస్తే, రామ్ చరణ్, ఎన్టీయార్ వంటి నటులకు దక్కాల్సిన ఈ జాతీయ పురస్కారం అల్లు అర్జున్‌కి అదీ యాంటీ సోషల్ ఎలిమెంట్‌లో హీరోగా కనిపించిన అల్లు అర్జున్ దక్కించుకోవడంపైనే అనేక విమర్శనాస్ర్తాలు సంధించబడుతున్నాయ్.
అల్లు అర్జున్ ఈ అవార్డును కొనేసుకున్నాడంటూ లాబీయింగ్ చేశాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయ్. ఏది ఏమైతేనేం, జాతీయ అవార్డుల జ్యూరీకి తెలుగు సినిమా అంటే ఒకింత చిన్న చూపు వుందన్న వాదన లేకపోలేదు. అది దాటి ఇప్పుడు ఓ తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కట్టబెట్టడం నిజంగా ఆహ్వానించదగ్గ, సంతోషించదగ్గ విషయం. అందులో ఎంత మాత్రం అనుమానమే లేదు.
తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







