ఆనంద్ దేవరకొండ నెక్స్‌ట్ ఏంటీ.?
- August 27, 2023
‘బేబీ’ సినిమాతో ఆనంద్ దేవరకొండ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది. అప్పటి వరకూ ఆనంద్ నటించిన ‘దొరసాని’ తదితర సినిమాలూ సో సోగా ఆకట్టుకున్నాయంతే.
‘బేబీ’తో పవర్ ఫుల్ సక్సెస్ కొట్టేశాడీ యంగ్ హీరో. సినిమా అంతా సెటిల్డ్ పర్‌ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా, యూత్‌ని మెప్పించాడు తనదైన నటనతో ఆనంద్ దేవరకొండ.
దీంతో, ఆనంద్ చేయబోయే తదుపరి సినిమాల గురించి ఆరా మొదలు పెట్టారు. ఆనంద్ ప్రస్తుతం ‘గం గం గణేశా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రగతి శ్రీ వాత్సవ్, కరిష్మా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదో క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. ‘బేబీ’తో పెరిగిన అంచనాల్ని తదుపరి సినిమాతో ఆనంద్ దేవరకొండ కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







