యూఏఈ లో పాఠశాలలు పునఃప్రారంభం. మొదటి రోజు భారీగా రద్దీ

- August 28, 2023 , by Maagulf
యూఏఈ లో పాఠశాలలు పునఃప్రారంభం. మొదటి రోజు భారీగా రద్దీ

యూఏఈ: రెండు నెలల వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో సోమవారం ఉదయం యూఏఈలోని రోడ్లపై భారీ ట్రాఫిక్ నెలకొంది. షార్జా-దుబాయ్‌లను కలిపే ఇత్తిహాద్ రోడ్, అల్ తౌన్ రోడ్ మరియు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ వంటి అన్ని ప్రధాన రహదారులు సోమవారం స్కూల్ బస్సులతో ట్రాఫిక్ కనిపించింది. ఉదయం 6.40 గంటలకు సఫీర్ మాల్ నుండి అల్ ముల్లా ప్లాజాకు ఇత్తిహాద్ రోడ్‌లో ట్రాఫిక్ నత్త వేగంతో కదులుతున్నట్లు గూగుల్ మ్యాప్స్ చూపించాయి. అలాగే, చాలా పాఠశాలలు ఉన్న మువీలా, అల్ నహ్దా, అల్ ఖుసైస్, అల్ బర్షా మరియు ఇతర ప్రాంతాలను కలిపే రహదారులు చాలా రద్దీగా కనిపించాయి. రెండు నెలల వేసవి సెలవుల తర్వాత సోమవారం యూఏఈ అంతటా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి.  దీంతో వాహనదారులు సకాలంలో కార్యాలయానికి చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. చాలామంది కార్యాలయాలకు సకాలంలో చేరుకునేందుకు తొందరగా బయలుదేరినట్లు తెలిపారు.  మరోవైపు ఆగస్టు 28ని 'ప్రమాదాలు లేని రోజు'గా డ్రైవ్ చేపట్టింది అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ. డ్రైవర్లు వారు ప్రమాదాన్ని నివారించి, ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడకపోతే, వారి డ్రైవింగ్ లైసెన్స్ నుండి నాలుగు బ్లాక్ పాయింట్లు క్లియర్ చేయబడతాయని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com