భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) లో ఉద్యోగాలు...
- August 31, 2023
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ & టెక్నీషియన్, ప్రొబేషనరీ ఇంజనీర్ మొదలైన వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తన అధికారిక వెబ్సైట్లో 34 డిప్యూటీ ఇంజనీర్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల ఖాళీలకు సంబంధించి డిప్యూటీ ఇంజనీర్ (మెకానికల్)18 ఖాళీలు, డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) 16 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్, బీఎస్సి, పూర్తిచేసి ఉండాలి. ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి.
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 09, 2023 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







