ఆంధ్ర కళా వేదిక-ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు బాషా దినోత్సవ వేడుకలు
- August 31, 2023
దోహా: ఆంధ్ర కళా వేదిక ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "తెలుగు భాషా దినోత్సవం" కార్యక్రమం, ఈ ఏడాది కూడా 29 ఆగష్టు 2023 మంగళవారం నాడు వ్యావహారిక బాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి 160వ జయంతిని పురస్కరించుకొని ఎంతో వైవిధ్యంగా, ఆసక్తికరంగా మరియు ఘనంగా నిర్వహించారు.
ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఖతార్ లో ప్రప్రధమంగా మరియు ఉచితంగా తెలుగు బాషా తరగతుల నిర్వహణ, తెలుగు బాషా దినోత్సవం మరియు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వంటి కార్యక్రమాల నిర్వహణ కేవలం ఆంధ్ర కళా వేదిక ద్వారా మాత్రమే జరుగుతున్నందుకు చాలా ఆనందంగానూ మరియు గర్వంగానూ ఉందని అన్నారు.
వైవిధ్యమైన కార్యక్రమాలకు పేరుగాంచిన ఆంధ్ర కళా వేదిక ఈసారి తెలుగు బాషా దినోత్సవ కార్యక్రమాన్ని కూడా వైవిధ్యంగా నిర్వహించామని, ఖతార్ లోని భారతీయ పాఠశాలలు(DPS-మోడరన్ ఇండియన్ స్కూల్, DPS-Monarch ఇంటర్నేషనల్ స్కూల్, లొయోల ఇంటర్నేషనల్ స్కూల్, Greenwood ఇంటర్నేషనల్ స్కూల్ మరియు బిర్లా పబ్లిక్ స్కూల్) లలో తెలుగు బోధనాంశంగా మరియు పాఠ్యాంశంగా బోధిస్తున్న ఉపాధ్యాయులను మరియు ఆ పాఠశాలల యాజమాన్యాన్ని అభినందిస్తూ వారిని చిరు జ్ఞాపికతో సత్కరించటం చేశామని తెలిపారు. వారితో పాటుగా తమ సాహిత్య రచనలతో మరియు హాస్య కార్టూన్లతో తెలుగు వారందరినీ అలరిస్తూ మరియు చైతన్య పరుస్తున్న ప్రసాద్ ఇంద్రగంటి మరియు రవీంద్ర వానపల్లి ని కూడా అభినందిస్తూ వారిని జ్ఞాపికతో సత్కరించటం జరిగిందని అన్నారు. తెలుగు భాష ఉనికిని కాపాడుతూ వారు అందిస్తున్న తోడ్పాటుకి మరియు సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
అన్ని పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తెలుగు బాషపట్ల తమకున్న అభిమానాన్ని, వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంతటి బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని అద్భుతంగా మరియు వైవిధ్యంగా నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని బహు ప్రశంసించారు.
ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి, శ్రీసుధ, శిరీషా రామ్, శేఖరం రావు మరియు గొట్టిపాటి రమణ కి అభినందనలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







