సోయా ఛాట్
- June 25, 2015
కావలిసిన పదార్థాలు
సోయా గ్రాన్యూల్ ` కప్పు
ఉల్లిపాయ తరుగు - అరకప్పు
టొమాటో ముక్కలు - అరకప్పు
చాట్ మసాలా, గరం మసాలా - చెంచా చొప్పున
అల్ల వెల్లుల్లి పేస్ట్ ` టేబుల్ స్పూన్
పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి - నాలుగు
జీలకర్ర, మినపప్పు - ఒక టేబుల్ స్పూన్
ఎండుమిర్చి ` మూడు
ఉప్పు ` తగినంత
నిమ్మరసం - 2 స్పూన్లు
కొత్తిమీర తరుగు ` 2 చెంచాలు
నూనె - 2 చెంచాలు
తయారీ విధానం
మినపప్పు, ఒక చెంచా సోయాగ్రాన్యూల్స్, ఎండుమిర్చి, జీలకర్రను నూనెలేకుండా బాణలిలో దోరగా వేయించుకోవాలి. వేడి చల్లారాక పొడిలా చేసి పక్కన ఉంచాలి. తరువాత మిగిలిన సోయా గ్రాన్యూల్స్‌ని ఒక గిన్నెలోకి తీసుకొని, మునిగే వరకూ నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి ఒక ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. అవి ఉడికిన తరువాత దానిలోని నీళ్లు వడగట్టి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి, తరిగిన ఉల్లి ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి, దానిలో ముందుగా ఉడికించి పెట్టిన సోయాగ్రాన్యూల్స్ వేయాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టిన సోయా, ఎండుమిర్చి పొడి వేసి తగినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టేయ్యాలి. కాసేపటికి దానిలోని నీరు పోయి, పొడి పొడిగా చాట్‌లా అయిపోతుంది.దానికి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సోయా ఛాట్ రెఢీ.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







