జర్నలిస్టులకు రూ. 30 లక్షల ఆరోగ్య బీమా..
- September 12, 2023
హైదరాబాద్: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఢిల్లీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యూనియన్ సభ్యులకు ఉచితంగా మూడేళ్ల పాటు ఆరోగ్య బీమా కల్పించింది. పుట్టిన ఊరికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఆరోగ్య రక్షణ, సంక్షేమం కోసం టియూడబ్ల్యూజే (TUWJ) నిజాయితీ, నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గత రెండేళ్ల నుంచి ఏటా పది లక్షల రూపాయల ఆరోగ్య బీమాను ఉచితంగా కల్పిస్తోంది. ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు మూడు సంవత్సరాల పాటు ఆరోగ్య రక్షణ కల్పిస్తూ ఈ ఏడాది టీయుడబ్ల్యూజే సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తెలంగాణ భవన్ లోని గురజాడ హాల్లో ఢిల్లీ యూనియన్ అధ్యక్షుడు నాగిల్ల వెంకటేష్ చేతుల మీదుగా జర్నలిస్టులందరికీ ఆరోగ్య బీమా ప్రీమియం చెక్కులను అందజేసింది. దాదాపు 1100 రోజులపాటు ఈ ఆరోగ్య రక్షణ వర్తిస్తుంది. ఏడాదికి పది లక్షల రూపాయల కవరేజ్ చొప్పున మూడు సంవత్సరాలకు 30 లక్షల రూపాయల కవరేజ్ యూనియన్ కల్పించడం జరిగింది. మొత్తం ఐదేళ్లపాటు యూనియన్ సభ్యులందరికీ 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను ఉచితంగా కల్పించి కమిటీ తన సభ్యుల శ్రేయస్సు కోసం అకుంఠిత నిబద్ధతను చాటుకుంది.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఢిల్లీ అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, కోశాధికారి శిరీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు దూదిపాల విజయ్, రవీందర్ రెడ్డి కార్యదర్శులు కొన్నోజు రాజు, మేక గోపికృష్ణ, జబ్బర్ లాల్ నాయక్, నాగరాజు సభ్యులు సతీష్, రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్‌ప్రెస్‌వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్







