చంద్రబాబు అరెస్టు పై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్
- September 12, 2023
విజయవాడ: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుపై హైకోర్టులో మంగళవారం లంచ్మోషన్ పిటిషన్ దాఖలయ్యింది. చంద్రబాబు తరపు లాయర్ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ పిటిషన్ వేశారు. చంద్రబాబు అరెస్టు న్యాయ, చట్టవిరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టులో నిబంధనలను పాటించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రేపు ఉదయం ఈ పిటిషన్పై విచారణ జరిగే అవకాశముంది. ఉన్నత న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై ఎపిలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై అధికార పార్టీ కూడా పలు పిటిషన్లను వేస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







