CWC సమావేశాల షెడ్యూల్ విడుదల చేసిన ఏఐసీసీ
- September 13, 2023
న్యూఢిల్లీ: హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 16, 17వ తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల ఏర్పాట్లలో రాష్ట్ర నాయకత్వం తలమునకలై ఉంది. ఈ ఏర్పాట్లపై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్‌ను ఏఐసీసీ తాజాగా విడుదల చేసింది.
ఏఐసీసీ షెడ్యూల్ ప్రకారం..
- ఈ నెల 16 తేదీన మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ పీసీసీ ఇచ్చే లంచ్‌కు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరు కానున్నారు.
- అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అంటే లంచ్ తర్వాత హోటల్ తాజ్ కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది.
- 17వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఎక్సెటెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది.
- సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభలో సీడబ్ల్యూసీ, అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఏల్పీ నేతలు పాల్గొననున్నారు.
- 18వ తేదీన ఎంపీలు మినహా మిగతా నేతలంతా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర ప్రజలకు 5 హామీలతో కూడిన గ్యారెంటీ కార్డులను ప్రజలకు అందజేయనున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







