రేపు జైల్లో చంద్రబాబును కలవనున్న పవన్ కల్యాణ్!
- September 13, 2023
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్… రేపు రాజమండ్రి కేంద్రకారాగారంలో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడును కలవనున్నారు. మూడు రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబును నిన్న ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కలిశారు. రేపు చంద్రబాబుతో జనసేనాని ములాఖత్ కానున్నారు. జైలు పరిసరాల్లో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. రేపు పవన్ రాక నేపథ్యంలో మరింత భద్రతను ఏర్పాటు చేయనున్నారు.
చంద్రబాబు అరెస్టైన సమయంలోనే ఆయనను కలిసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ ఏపీ పోలీసులు అందుకు అనుమతించలేదు. ఓసారి బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించారు. మరోసారి రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు జనసేనానిని అడ్డుకున్నారు. ఇప్పుడు కేంద్రకారాగారంలో ములాఖత్‌కు అనుమతి లభించింది. మరోవైపు, టిడిపి అధినేత చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా నేడు సాయంత్రం నాలుగు గంటలకు జైల్లో చంద్రబాబుతో భేటీ కానున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







