సైమా అవార్డుల్లో RRR హంగామా..
- September 16, 2023
దుబాయ్: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) 2023 వేడుకలు దుబాయ్ లో ఘనంగా నిన్న సెప్టెంబర్ 15న జరిగాయి. రెండు రోజుల పాటు ఈ అవార్డు వేడుకలు జరుగుతుండగా నిన్న తెలుగు, కన్నడ పరిశ్రమల అవార్డుల వేడుక జరగగా నేడు తమిళ్, మలయాళం సినీ పరిశ్రమలకు సంబంధించిన వేడుక జరగనుంది. దుబాయ్ లో గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్లో అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ ఈవెంట్ కి మీడియా పార్టనర్ గా మాగల్ఫ్.కామ్,హోస్ట్ పార్టనర్ గా Truckers వ్యవహరించాయి.

ఇక తెలుగులో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, ఉత్తమ నటిగా శ్రీలీల అవార్డులు గెలుచుకున్నారు. గత సంవత్సరం రిలీజయిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా నాటు నాటు సాంగ్ తో ఆస్కార్, గోల్డెన్ గ్లొబ్ అవార్డులు కూడా అందుకుంది. ఆ తర్వాత కూడా RRR సినిమా మరిన్ని వేదికలపై మరిన్ని అవార్డులు గెలుచుకుంటూనే ఉంది.
తాజాగా జరిగిన సైమా అవార్డుల్లో కూడా RRR హవా కొనసాగింది. RRR సినిమా మొత్తం 11 కేటగిరీల్లో నామినేట్ అవ్వగా ఏకంగా 5 అవార్డులు గెలుచుకొని టాప్ లో ఉంది. ఉత్తమ నటుడు – ఎన్టీఆర్, ఉత్తమ దర్శకుడు – రాజమౌళి, ఉత్తమ సంగీత దర్శకుడు – MM కీరవాణి, ఉత్తమ సినిమాటోగ్రఫీ – KK సెంథిల్ కుమార్, ఉత్తమ గీత రచయిత – చంద్రబోస్ (నాటు నాటు సాంగ్) లకు RRR సినిమాకు గాను అవార్డులు వచ్చాయి. దీంతో RRR యూనిట్ కి అందరూ మరోసారి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ వేడుకల్లో అందరూ అవార్డులు అందుకోగా రాజమౌళి, కీరవాణి మాత్రం అవార్డుల వేడుకకు హాజరు కాలేదు. ఇక RRR సినిమా తర్వాత సీతారామం సినిమా మూడు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది.
తెలుగులో సైమా అవార్డ్స్ వీరికే
ఈ ఏడాది సైమా విజేతలు వీరే
ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్. రాజమౌళి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతీ మూవీస్)
ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్)
ఉత్తమ విలన్: సుహాస్ (హిట్2)
ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్ రెడ్డి (కార్తికేయ 2)
ఉత్తమ పరిచయ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ సంగీత దర్శకుడు: కీరవాణి(ఆర్ఆర్ఆర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె. సెంథిల్ కుమార్(ఆర్ఆర్ఆర్)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (నాటు నాటు)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (డీజే టిల్లు)
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ (కార్తికేయ2)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడివి శేష్ (మేజర్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







