SIIMA 2023: దుబాయ్ వేదిక పై తారక్ ఎమోషనల్ స్పీచ్
- September 16, 2023
దుబాయ్: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) 2023 వేడుకలు దుబాయ్ లో ఘనంగా నిన్న సెప్టెంబర్ 15న జరిగాయి. రెండు రోజుల పాటు ఈ అవార్డు వేడుకలు జరుగుతుండగా నిన్న తెలుగు, కన్నడ పరిశ్రమల అవార్డుల వేడుక జరగగా నేడు తమిళ్, మలయాళం సినీ పరిశ్రమలకు సంబంధించిన వేడుక జరగనుంది. దుబాయ్ లో గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్లో అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ ఈవెంట్ కి మీడియా పార్టనర్ గా మాగల్ఫ్.కామ్,హోస్ట్ పార్టనర్ గా Truckers వ్యవహరించాయి.
ఇక ఈ వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘‘నా ఒడుదొడుకుల్లో అభిమానులు తోడున్నారు. నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను పట్టుకుని పైకి లేపారు. నా కంటి వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా సంతోషపడ్డారు. నన్ను అభిమానించే అందరికీ తలవంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే నాపై నమ్మకంతో కొమురం భీమ్ లాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు. ఇక నా సహనటుడు, నా సోదరుడు, స్నేహితుడు చరణ్కు కూడా ఈ సందర్భంగా థ్యాంక్యూ చెబుతున్నాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతోంది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







