చంద్రబాబు కు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీ
- September 16, 2023
న్యూ జెర్సీ: సెప్టెంబర్:16 చంద్రబాబుకు మద్దతుగా తెలుగు ప్రజలు అమెరికాలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు.. అన్యాయంగా చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. అమెరికాలో న్యూజెర్సీలో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. చంద్రబాబును జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము ఈ రోజు అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నామంటే అదంతా చంద్రబాబు చేసిన కృషి వల్లే సాధ్యమైందని నిరసనలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు అన్నారు. తెలుగుదేశం, జనసేన మద్దతుదారులతో పాటు పార్టీలకతీతంగా న్యూజెర్సీలో ఉంటున్న తెలుగు ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలనే నినాదాలతో న్యూజెర్సీ వీధుల్లో హోరెత్తించారు. వియ్ వాంట్ జస్టీస్, వియ్ ఆర్ విత్ సీబీఎన్ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచం కీర్తించిన నాయకుడిని, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన దార్శనికుడిని జైలులో పెడతారా అంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళలు, ఉద్యోగులు నిలదీశారు. చంద్రబాబును విడుదల చేసే వరకు తాము కూడా బాబు అండగా ఉద్యమిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







