బిగ్ టికెట్ అబుధాబి వీక్లీ డ్రా లో జాక్‌పాట్ కొట్టిన హైదరాబాదీ డ్రైవర్..
- September 17, 2023
అబుధాబి: బిగ్ టికెట్ అబుధాబి వీక్లీ డ్రా లో ఒమన్‌లో ఉంటున్న హైదరాబాదీ జాక్‌పాట్ కొట్టాడు. నరేష్ కుమార్ అనే డ్రైవర్ 1లక్ష దిర్హామ్స్ గెలుచుకున్నాడు. అతడు కొనుగోలు చేసిన లాటరీ నంబర్. 141484కి ఈ జాక్‌పాట్ తగిలింది. ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నరేష్ కుమార్ గత 10 సంవత్సరాల నుంచి మస్కట్‌లో ఉంటున్నాడు. సహోద్యోగులు, స్నేహితుల ఇలా పది మందితో కలిసి గత నాలుగేళ్లుగా బిగ్ టికెట్ డ్రాలో పాల్గొంటున్నాడు. చివరికి అతనికి అదృష్టం వరించడంతో భారీ మొత్తం గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ.. "చాలా సంతోషంగా ఉంది. ఇంత భారీ మొత్తం గెలుచుకున్నానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అని హర్షం వ్యక్తం చేశారు. తాను గెలిచిన ప్రైజ్‌మనీ తో హైదరాబాద్‌లో బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







