నయన తారే కావాలంటున్నారట.!
- September 19, 2023
సౌత్ క్వీన్ ఇప్పుడు నార్త్‌లో హవా చూపిస్తోంది. ఇటీవల ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది నయన తార. తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ అవ్వడం.. షారూఖ్ ఖాన్, నయనతార జంటకి మంచి క్రేజ్ రావడం.. ఇవన్నీ సౌత్ క్వీన్‌ని నార్త్‌కి దగ్గర చేసేశాయ్.
దాంతో, వరుస అవకాశాలు నయనతారకు క్యూ కట్టేస్తున్నాయట. ఈ క్రమంలో సౌత్ నుంచి కొన్ని అవకాశాలు వదులుకుంటోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్త మవుతున్నాయ్.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో నయన తార ఓ ప్రాజెక్ట్ ఓకే చేసిందన్న సమాచారం అయితే వుంది. అలాగే, మరో స్టార్ హీరో కూడా నయనతారే హీరోయిన్గా కావాలంటున్నాడట.
ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న నయన తార, అమాంతంగా రెమ్యునరేషన్ పెంచేసిందట. దాంతో, ఆ సినిమా రూపొందించే నిర్మాణ సంస్థ కాస్త తటపటాయిస్తోందట.
కానీ, ఆ హీరో మాత్రం నయన తారే తన హీరోయిన్.. అని గట్టిగా పట్టు పట్టి కూర్చున్నాడట. అసలే స్టార్ హీరో.. ఆ పై ప్రెస్జీజియస్ ప్రాజెక్ట్.. చేసేదేం లేక సదరు నిర్మాణ సంస్థ డైలమాలో పడిందట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో.? ఏంటా కథ.?
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







