కాబోయే అత్తారింట ఘనంగా వినాయక చవితి వేడుకలు.! లావణ్య వైభోగమే వైభోగం.!
- September 19, 2023
‘అందాల రాక్షసి’గా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి తిరుగులేని ప్రమోషన్ కొట్టేసింది పర్సనల్ లైఫ్‌లో. అదేనండీ. మెగా కోడలు అనే ట్యాగ్ దక్కించుకుందిగా వరుణ్ తేజ్‌తో లవ్‌లో పడి.
ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న లావణ్య త్రిపాఠి, తాజాగా కాబోయే అత్తారింట వినాయక చవితి వేడుకల్లో పాల్గొంది. బంగారు పుష్పాలతో సిద్ది వినాయకున్ని పూజించిన లావణ్య.. ముఖంలో ఎక్కడ లేని చిరునవ్వుతో మురిసిపోతోంది.
అత్త మామలు (నాగబాబు అండ్ ఫ్యామిలీ)తో కలిసి లావణ్య.. తన భర్త వరుణ్ తేజ్‌తో పాటూ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయ్.
ఇదిలా వుంటే, మెగా కోడలయ్యాక లావణ్య త్రిపాఠి.. తాను ఎంచుకోబోయే ప్రాజుక్టుల విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తోందట.. అనే ప్రచారం ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అటూ ఇటూ అయితే, ఆయా ప్రాజెక్టులు వదిలేసుకుంటోందట కానీ, మెగా ప్యామిలీ గౌరవానికి తన కారణంగా ఎలాంటి మాటా రాకుండా వుండేలా జాగ్రత్త పడుతోందట.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







