పామ్ జెబెల్ అలీ విల్లాలు అమ్మకం.. క్యూకట్టిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లు
- September 21, 2023
యూఏఈ: దుబాయ్ తాజా వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ‘పామ్ జెబెల్ అలీ’ సంచలనం సృష్టించింది. వందలాది మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, కొనుగోలుదారులు బుధవారం మాస్టర్ డెవలపర్ నఖీల్ ప్రధాన కార్యాలయం వెలుపల క్యూ కట్టారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండే సుఫౌహ్‌లోని కార్యాలయం ముందు వెయిట్ చేసినట్టు ప్రాపర్టీ ఏజెంట్ జెఫ్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఆఫీసు తెరవడంతో అందరూ పరుగులుపెట్టారని, అదృష్టవశాత్తూ, నా క్లయింట్ కోసం నేను ఒక విల్లాని పొందగలిగానని తెలిపారు. వీరి హడావుడికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రాపర్టీ ఏజెంట్ల ప్రకారం, అందుబాటులో ఉన్న అన్ని యూనిట్లు గంటల్లోనే అమ్ముడయ్యాయి. M, N, O మరియు P - ప్రాజెక్ట్ యొక్క నాలుగు భాగాలలో యూనిట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఫ్రంట్‌లో 109 మరియు 165 విల్లాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ప్రకారం.. అరచేతి ఆకారంలో ఉన్న మానవ నిర్మిత ద్వీపంలోని విల్లాల ధరలు Dh18.5 మిలియన్ల నుండి ప్రారంభమవ్వగా.. యూనిట్లు 2027 నుండి డెలివరీ చేయబడతాయని భావిస్తున్నారు. మొత్తం 13.4చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం పామ్ జుమేరా కంటే రెండింతలు పెద్దది. ఇది దుబాయ్‌లోని ఏ గమ్యస్థానం కంటే పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది పూర్తవుతే ఏడు ద్వీపాలు, 16 ఫ్రాండ్‌లను కలిగి ఉంటుంది.ద్వీపానికి మూడు యాక్సెస్ పాయింట్‌లతో మొత్తం 91 కి.మీ. విస్తరించి ఉంది. ఇందులో 80 హోటళ్లు, రిసార్ట్‌లతో పాటు అనేక ప్రత్యేకమైన రిటైల్, డైనింగ్ అనుభవాలను కలిగి ఉంటుంది. కోవిడ్ -19 దెబ్బకు ముందు దుబాయ్‌లో ఆస్తి కొనుగోలుదారుల పొడవైన క్యూలు ఒక సాధారణ దృశ్యం. కాగా,ప్రాపర్టీ మార్కెట్ ప్రీ-పాండమిక్ స్థాయికి తిరిగి పుంజుకోవడంతో మళ్లీ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.
حالياً من مشروع #نخلة_جبل_علي 🌴
— Mohammed Taqi (@MohdTaqi11) September 18, 2023
تبدأ الاسعار بـ 18 مليون
فخر مشاريع وانجازات الوطن #جبل_علي
الاسم الذي من حينٍ الى أخر يتصدر المشهد الإقتصادي العالمي
جبل علي اصبح براند و ماركة مسجلة في كل محفل اقتصادي وتجاري و هو الأسم الذي تقف امامه احتراماً وتقديراً لإنجازاته العالمية pic.twitter.com/haaCRt7DmH
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్‌కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్‌లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్‌లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









