దుబాయ్ లో ఉమ్మితే భారీ జరిమానా
- June 25, 2015
దుబాయ్ లో పర్యాటకులను ఆకట్టుకోవడానికి అక్కడి అందాలను, పరిసర ప్రాంతాలను పరిరక్షించుకోవాలని పాలకులు నిర్ణయించారు. పరిసర ప్రాంతాలను పాడు చేసి నిర్లక్షంగా వ్యవహరించే వారికి భారీగా జరిమానా విధించాలని నిర్ణయించారు. ఎమిరేట్స్ అందాలను పాడు చేస్తున్న వారిని గుర్తించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక నిఘా వర్గాలను ఏర్పాటు చేసింది. ఆ నిఘా వర్గాలు గుట్టు చప్పుడు కాకుండా వివిధ ప్రాంతాలలో సంచరించనున్నారు. దుబాయ్ లో ఎక్కడైనా రోడ్ల మీద, రోడ్ల పక్కన ఉమ్మి వేస్తే రూ. 17,000 వేలు (వెయ్యి దిర్హమ్స్) అపరాధ రుసుం విధించనున్నారు. అదే విధంగా రోడ్ల చుట్టు పక్కల ఉన్న గొడల మీద అనుమతి లేకుండా పోస్టర్లు అతికించినా రూ. 17,000 ఫైన్ కట్టవలసి ఉంటుంది. సముద్రంలోకి చమురు లీకేజ్ చేసిన వారికి రూ. 51,000, దుబాయ్ మునిసిపాలిటి చెత్త వాహనాలలో పురుగుల మందు క్యాన్ లు విసిరి వేస్తే రూ. 85,000 అపరాద రుసుం విధించాలని అక్కడి పాలకులు నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకులను ఆకర్షించి దుబాయ్ ఆందాలను కాపాడటానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామని పాలకులు అంటున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







