తొందరపాటుతో భంగపాటు
- June 25, 2015
ఒక అడవిలోని ఒక సరస్సు ఒడ్డున ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు మీద అనేక రకాల పక్షులు నివాసం ఏర్పర్చుకుని ఉండేవి. అదే చెట్టుకు మధ్యలో ఒక పెద్ద తొర్ర ఉండేది. ఆ చెట్టు తొర్రలో ఒక రాబందు కూడా ఉండేది. వయసయిపోవడం వల్ల అది గూటిలోనే ఉండి ఆ చెట్టు మీదున్న పక్షులన్నింటికీ పెద్ద దిక్కుగా ఉండేది. ఆ పక్షులు తెచ్చి ఇచ్చిన కొద్దో గొప్పో ఆహారంతో తన కడుపు నింపుకుని జీవనం సాగించేది. అలా ఉండగా ఒకరోజు ఆ చెట్టు కిందికి ఒక పిల్లి తన కాలికి గాయంతో బాధపడుతూ వచ్చింది. పాపం కాలికి దెబ్బ తగలడం వల్ల రక్తం కారుతూ, చాలా బాధగా ఉంది. అప్పుడు ఆ చెట్టు మీదున్న పక్ష్లులు కొన్ని కిందికి వచ్చి పిల్లి మామా..పిల్లి మామా ఏమైంది నీ కాలికి అని అడిగాయి. అప్పుడది అడవిలో వస్తుండగా ఒక కుక్కల మంద నామీద పడి నన్నిలా గాయపరిచాయి. నేనెలాగో తప్పించుకుని ఈ చెట్టు కిందికి చేరుకున్నాను అని బాధపడుతూ చెప్పింది. అప్పుడు ఆ పక్షులు జాలిపడి రాబందును పిలిచి ఆ పిల్లి కాలుకి కట్టు కట్టించి అది తగ్గే వరకూ తమ వద్దనే ఉంచుకుందామని నిర్ణయించుకున్నాయి. అయితే పిల్లిని ఎవరి వద్ద ఉంచాలా? అని ఆలోచించి చివరకు రాబందు ఉంటున్న తొర్రలో ఉండమని చెప్పాయి. పాపం రాబందు తను తెచ్చుకున్న ఆహారంలోనే కొద్దిగా ఆ పిల్లికి కూడా ఇచ్చి దాని గాయం తగ్గేంత వరకూ తనతోనే ఉంచుకుంది. అయితే బాగా తినమరగిన పిల్లికి ఇంతలో ఒక పాడు ఆలోచన వచ్చింది. ఈ చెట్టు మీద అనేక పక్షులు, వాటి గుడ్లు, చిన్న చిన్న పక్షి పిల్లలు చాలా ఉన్నాయి కదా.. ఏదో ఒక రకంగా వీళ్లని మోసం చేసి ఇక్కడే కొన్నాళ్లు తన పబ్బం గడుపుకుందామని దురాలోచన చేసింది. దానిలో భాగంగా రోజూ అర్ధరాత్రి చెట్టుపైకెళ్లి ఒక్కొక్క పక్షి పిల్లను చంపి తినేసి వాటి ఈకలు తెచ్చి రాబందు పక్కన ఉంచి, వాటి రక్తాన్ని రాబందు నోటికి రుద్దేస్తూ ఉండేది. పాపం అది గమనించని రాబందు యధావిధిగా తన పనుల్లో నిమగ్నం అవుతూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు పక్షులకన్నింటికీ అనుమానం వచ్చింది. తమ పిల్లలు మాయం అయిపోవడాన్ని గమనించి, రాబందు తొర్ర వద్దకు వచ్చి చూడగా, తొర్రలో రాబందు లేదు. పిల్లి ఉంది. అదే అవకాశంగా పిల్లి వాటికి రాబందుపై లేని పోనివి చెప్పి వాటిని నమ్మించింది. దాంతో ఆ పక్షులు పిల్లి చెప్పింది నమ్మి రాబందును చంపడానికి నిశ్చయించుకున్నాయి. రాబందు రాగానే దాన్ని ఏమీ అడక్కుండా వాటి ముక్కులతో పొడిచి, పొడిచి చంపేశాయి. దాంతో భయపడిన పిల్లి అక్కడి నుండి చెప్పపెట్టకుండా పారిపోయింది. ఆ తరువాత నిజం తెలుసుకున్న పక్షులు తమ తొందరపాటుకు చాలా బాధపడ్డాయి. మంచిదైన రాబందును కోల్పోయాయి.
నీతి : తొందరపాటు అన్ని అనర్ధాలకు కారణం.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







