గృహ కార్మికులుగా కువైట్ వస్తున్నారా.. ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు
- September 25, 2023
కువైట్: డొమెస్టిక్ వర్కర్(DW) వీసాపై కువైట్లో ఉన్న భారతీయ పౌరుల కోసం కువైట్లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. కువైట్లోని డొమెస్టిక్ వర్కర్ చట్టాలు (లా నం. 68 ఆఫ్ 2015), సంబంధిత మంత్రిత్వ నిర్ణయాలు మరియు కార్యనిర్వాహక నిబంధనల ప్రకారం ఒక భారతీయ జాతీయుడు గృహ కార్మికునిగా కువైట్కు రావడానికి అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
రాతపూర్వక ఉపాధి ఒప్పందం (అరబిక్ , ఆంగ్లంలో), తప్పనిసరి.
అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొన్న కనీస వేతనం కంటే తక్కువ ఉండకూడదు. (భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, కువైట్లోని భారతీయ జాతీయ DWలకు సూచించిన కనీస వేతనాలు నెలకు KD 120.)
ఏ తగ్గింపు లేకుండా చేరిన తేదీ నుండి ప్రతి నెలాఖరులో అంగీకరించిన వేతనం చెల్లింపు జరగాలి. (అంగీకరించిన వేతనాలు చెల్లించని పక్షంలో, ఆలస్యమైన ప్రతి నెలకు KWD 10/- యజమాని చెల్లించాలి).
ఉచిత ఆహారం, దుస్తులు, వైద్య చికిత్స మరియు తగిన వసతి కల్పించడం తప్పనిసరి.
అదనపు పనికి పరిహారం (చెల్లించని పక్షంలో, PAM విచారణ జరిపి, అంగీకరించిన వేతనానికి రెట్టింపు చెల్లించమని యజమానిని ఆదేశించవచ్చు).
వారాంతపు విశ్రాంతితోపాటు వార్షిక సెలవులను ఇవ్వాలి.
సేవా ముగింపు ప్రయోజనాలుగా ప్రతి సంవత్సరానికి ఒక నెల వేతనం అదనంగా అందజేయాలి.
ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే లేదా మానవ గౌరవానికి భంగం కలిగించే ఎలాంటి ప్రమాదకర పనిని DWలకు కేటాయించవద్దు.
గరిష్ట పని గంటలు రోజుకు 12 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు.
DWల పాస్పోర్ట్/సివిల్ ఐడిని DWల అనుమతి లేకుండా యజమాని ఉంచుకోవడానికి నిబంధనలు అంగీకరించవు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







