3 రోజుల లాంగ్ వీకెండ్.. మస్కట్‌లో ఏం చూడొచ్చంటే?
- September 25, 2023
మస్కట్: ప్రవక్త ముహమ్మద్ (స) జయంతి సందర్భంగా అధికారిక సెలవుదినం దినం సందర్భంగా ఒమన్ వాసులకు మూడు రోజులపాటు వరుసగా సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో మస్కట్ లో నివాసితుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
సెప్టెంబరు 29 మరియు 30 తేదీలలో రాయల్ ఒపేరా హౌస్ మస్కట్‌లో సాయంత్రం 7 గంటలకు 'ది బార్బర్ ఆఫ్ సెవిల్లే' ఈ సీజన్ ప్రారంభం కానుంది. గొప్ప కామిక్ ఒపెరాలలో ఇదిఒకటి. టిక్కెట్లను ROHM బాక్స్ ఆఫీస్ వద్ద లేదా దాని యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
సెప్టెంబర్ 29న క్రౌన్ ప్లాజా మస్కట్, OCECలో బ్రంచ్, సర్కస్ మరియు మంత్రముగ్ధులను చేసే లేజర్ షోను ఎంజాయ్ చేయచ్చు.
లిటిల్ మెర్మైడ్ కూడా మస్కట్‌కు వస్తోంది. సెప్టెంబర్ 30న రిట్జ్-కార్ల్‌టన్ హోటల్ అయిన అల్ బస్టాన్ ప్యాలెస్‌లో హన్స్ క్రిస్టియన్ అండర్సన్ యొక్క ప్రత్యేకమైన ప్రదర్శన ఇవ్వనుంది.
భారతీయ హాస్యనటుడు, నటుడు వీర్ దాస్ తన అంతర్జాతీయ మైండ్ ఫూల్ టూర్‌ను ప్రారంభించాడు. ఇది ఏడు నెలల పాటు కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కవర్ చేస్తుంది. సెప్టెంబర్ 28 మస్కట్‌లో అల్ బస్టాన్ ప్యాలెస్ - ఎ రిట్జ్-కార్ల్‌టన్ హోటల్‌లో ప్రోగ్రామ్ జరగనుంది. వీర్ దాస్ తన స్టాండ్-అప్ కామెడీతో అందరిని అలరించనున్నారు.
సినీ ప్రియులు కూడా ఈ వారాంతంలో సమీపంలోని సినిమా హౌస్‌లలో విజువల్ ట్రీట్ ఊరిస్తుంది. జేమ్స్ మార్స్‌డెన్, ఇయాన్ ఆర్మిటేజ్, మెకెన్నా గ్రేస్ నటించిన ది మైటీ సినిమా.. ఇది సెప్టెంబర్ 28న విడుదలవుతోంది. దీంతోపాటు ది క్రియేటర్ కూడా 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ అభిమానుల కోసం పుల్కిత్ సామ్రాట్, పంకజ్ త్రిపాఠి, వరుణ్ శర్మ, రిచా చద్దా మరియు మంజోత్ సింగ్ నటించిన ఫుక్రే 3ని సెప్టెంబర్ 28న విడుదల కానుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







