ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటీషన్
- September 27, 2023
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను A14గా పేర్కొంటు సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేశ్ ముందుస్తు కోసం హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి ఇన్నర్ రింగ్ కేసులో లోకేశ్ ను సీఐడీ A-14గా చేర్చడంతో కోర్టుకు వెళ్లారు.
తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ తరువాత యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు లోకేశ్. ఆ తరువాత ఏపీలో జరిగిన పలు కీలక పరిణామాలతో ఢిల్లీ వెళ్లారు. ఓపక్క చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ అంటూ పలు అంశాలను జాతీయ మీడియా దృష్టికి తీసుకెళుతున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఆ తరువాత లోకేశ్ మీడియాతో మాట్లాడుతు..అసలు వేయని రోడ్డు విషయంలో తనపై కేసు పెట్టారని..అసలు వేయని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను A14గా చేర్చారని.. సంబంధం లేని శాఖ అయినా తనపై కేసు పెట్టటం ఏంటీ ఇదే జగన్ ప్రభుత్వం చేసే పనులు అంటూ మండిపడ్డారు. నా తండ్రి అరెస్ట్ తరువాత తాత్కాలికంగా పాదయాత్రకు విరామం ఇచ్చానని త్వరలోనే ప్రారంభిస్తానని ఎక్కడ నుంచి ఆపానో అక్కడ నుంచే ప్రారంభిస్తానని స్పష్టం చేశారు లోకేశ్. తాను పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని ప్రకటించాక యాత్రను ఆపే కుట్రలో భాగంగా తనను A14గా చేర్చారు అంటూ విమర్శలు సంధించారు.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







