దుబాయ్ లో 2026 నాటికి ఫ్లయింగ్ ట్యాక్సీలు
- September 28, 2023
దుబాయ్: దుబాయ్ 2026 నాటికి ఫ్లయింగ్ టాక్సీలు అందుబాటులోకి వస్తాయని స్కైపోర్ట్స్ CEO డంకన్ వాకర్ బుధవారం జరిగిన 3వ దుబాయ్ వరల్డ్ కాంగ్రెస్ ఫర్ సెల్ఫ్-డ్రైవింగ్ ట్రాన్స్‌పోర్ట్ ముగింపు సమావేశంలో చెప్పారు.2026 నాటికి శాశ్వత ఎయిర్ టాక్సీ సేవల కోసం పూర్తిగా అభివృద్ధి చెందిన వెర్టిపోర్ట్ నెట్‌వర్క్‌తో దుబాయ్ మొదటి నగరం (ప్రపంచంలో) అవుతుందని తెలిపారు.
వెర్టిపోర్ట్ (వర్టికల్ ఎయిర్‌పోర్ట్) అనేది డ్రోన్‌ల ల్యాండింగ్ మరియు టేకాఫ్ లేదా ఏదైనా అధునాతన ఎయిర్ మొబిలిటీ (AAM) రవాణా కోసం రూపొందించబడినది. సాంకేతికంగా ఇది హెలిప్యాడ్ లేదా హెలిపోర్ట్‌ను పోలి ఉండదు. ఇది ఎయిర్ ట్యాక్సీల వంటి eVTOL విమానాలతో పోలిస్తే భిన్నమైన పరిమాణం మరియు బరువు స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండే సంప్రదాయ హెలికాప్టర్‌లకు అనుగుణంగా తయారు చేశారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌కు RTA డైరెక్టర్ మత్తర్ అల్ టేయర్ వెర్టిపోర్ట్ మోడల్‌ను చూపించారు. ఈ మోడల్ పై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







