భారత కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ కుమార్ శివన్
- October 11, 2023
దుబాయ్: దుబాయ్‌లోని కొత్త కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా సతీష్ కుమార్ శివన్ మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు భారత కాన్సులేట్ ప్లాట్‌ఫామ్ X(గతంలో ట్విటర్)లో ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త కాన్సుల్ జనరల్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. శివన్ 2005-బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి. న్యూ ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)తో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. అలాగే విదేశాంగ మంత్రికి డిప్యూటీ సెక్రటరీగా కూడా పనిచేశారు. అంతకుముందు, శివన్ దక్షిణ కొరియాలోని సియోల్‌లోని భారత రాయబార కార్యాలయానికి డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా, అమెరికా వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి మొదటి కార్యదర్శిగా పనిచేశారు.
Mr. Satish Kumar Sivan assumes charge as Consul General of India in Dubai and the Northern Emirates @cgidubai today. pic.twitter.com/yvUQz0BxPR
— India in Dubai (@cgidubai) October 10, 2023
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







