గ్లోబల్ విలేజ్ కు 4 బస్సు మార్గాలు.. Dh10 టికెట్ ధర
- October 11, 2023
యూఏఈ: 2023-24 సీజన్ కోసం గ్లోబల్ విలేజ్‌కు సందర్శకులకు చేరవేసేందుకు నాలుగు ప్రత్యేక బస్సు మార్గాలను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రారంభించనుంది.ఈ సేవలు అక్టోబరు 18న ప్రారంభం కానున్నాయి. గ్లోబల్ విలేజ్‌కి ఒక్క ట్రిప్ ధర 10 దిర్హామ్ గా నిర్ణయించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినోదం, షాపింగ్ అనుభవాలు, వంటకాలను గ్లోబల్ విలేజ్ అందిస్తుంది. యూఏఈ శీతాకాలంలో ప్రసిద్ధ గమ్యస్థానంగా గుర్తింపు పొందింది. ఇది 1997లో ప్రారంభం నుండి 100 మిలియన్లకు పైగా సందర్శకులను స్వాగతించింది.ఈ సీజన్లో ప్రవేశ టిక్కెట్ ధరలు Dh22.5 నుండి ప్రారంభమవుతాయి.
>> రూట్ 102: ప్రతి గంటకు రషీదియా బస్ స్టేషన్ నుండి బయలుదేరుతుంది.
>> రూట్ 103: అల్ ఇత్తిహాద్ బస్ స్టేషన్ నుండి ప్రతి 40 నిమిషాలకు ఒక సర్వీస్ నడుస్తుంది.
>> రూట్ 104: అల్ ఘుబైబా బస్ స్టేషన్ నుండి ప్రతి గంటకు ఒక సర్వీస్.
>> రూట్ 106: మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ బస్ స్టేషన్ నుండి ప్రతి గంటకు సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







