వాణిజ్య రిజిస్ట్రేషన్లలో సౌదీ మహిళల హవా
- October 11, 2023
రియాద్: 2023 మూడవ త్రైమాసికంలో సౌదీ అరేబియాలో మొత్తం వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్య 1.3 మిలియన్లకు చేరుకుంది. వీటిలో 33.7 శాతం సౌదీ మహిళలు, 38.6 శాతం యువకులకు చెందినవి ఉన్నాయి. 2022 అదే త్రైమాసికంతో పోలిస్తే 2023 మూడవ త్రైమాసికంలో వాణిజ్య రిజిస్ట్రేషన్ల జారీలో 16 శాతం వృద్ధి నమోదు అయింది. సంవత్సరం రెండవ త్రైమాసికంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో వాణిజ్య నమోదు పెరుగుదల 2.3 శాతం కావడం గమనార్హం. ప్రస్తుత సంవత్సరం మూడో త్రైమాసికంలో మహిళలకు జారీ చేసిన రిజిస్ట్రేషన్ల రేటు 29 శాతానికి చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వ్యాపార రంగానికి సంబంధించిన త్రైమాసిక బులెటిన్‌లో ఈ మేరకు గణాంకాలు తెలిపాయి. 2023 మూడవ త్రైమాసికంలో రాజ్యంలో ఇ-కామర్స్, ఇతర ఆశాజనక రంగాలలో వాణిజ్య నమోదులో బలమైన వృద్ధిని నమోదు చేసనట్లు బులెటిన్ లో తెలిపింది. 2022 అదే త్రైమాసికంలో 568000 రిజిస్ట్రేషన్లతో పోల్చితే టెలికేర్ మరియు టెలిమెడిసిన్ కేంద్రాలు 33 శాతం వృద్ధిని సాధించాయని, 757000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌లు నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రియాద్ దాదాపు 404 రిజిస్ట్రేషన్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. దాని తర్వాత మక్కా (190) నిలిచింది. తూర్పు ప్రావిన్స్ (66), మదీనా (29) మరియు అల్-ఖాసిమ్ (15) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. రిజిస్ట్రేషన్ల పరంగా మొదటి ఐదు ప్రాంతాలు రియాద్ (14500), 9200 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లతో మక్కా, తూర్పు ప్రావిన్స్ (5900), మదీనా 1800 మరియు అల్-ఖాసిమ్ (1200) ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ రంగానికి సంబంధించి.. వృద్ధి రేటు 2022 మూడవ త్రైమాసికంలో 14000తో పోలిస్తే దాదాపు 19000 రిజిస్ట్రేషన్‌లతో 35 శాతానికి చేరుకుంది. అత్యధిక రిజిస్ట్రేషన్‌లు జరిగిన ప్రాంతాలు.. రియాద్ (8700), మక్కా (6200), తూర్పు ప్రావిన్స్ (2800), మదీనా (973) మరియు అల్-ఖాసిమ్ (884)గా ఉన్నాయి.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









