చంద్రబాబుకు అస్వస్థత..
- October 11, 2023
అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ రాజమండ్రి జైల్లో రిమాండ్ గా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా ఎండతీవ్రత ఎక్కువగా ఉండడం తో జైల్లో చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. అక్కడి వాతావరణ పరిస్థితులు, జైలులో గాలి లేకపోవడం కారణంగా చంద్రబాబు ఉక్కపోతకు గురయ్యారు.
తాను డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నట్లు జైలు అధికారులకు, వైద్యాధికారులకు తెలియజేశారు. దాంతో వైద్యులు ఆయనకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. కాగా, జైలులో సౌకర్యాల విషయమై.. తన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారని, వారు చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన చేస్తున్నారు. పోలీసులు, వైద్యాధికారులు మాత్రం సమస్య ఏమీ లేదని, అవసరైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు వాడీ వేడిగా కొనసాగాయి. 17ఎ సెక్షన్ పరిధిలోని అంశాలను చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టు ముందుంచారు. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను వివరించారు. 17ఎను అవినీతిని నిరోధించేందుకు తీసుకొచ్చారన ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. శుక్రవారం మరోసారి వాదనలు విననుంది కోర్ట్.
తాజా వార్తలు
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత
- అంతర్జాతీయ బాండ్ల జారీతో కువైట్‌కు 3.25 బిలియన్ డాలర్లు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం







