నిట్ ఉత్తమ అవార్డు గ్రహీత రాజా శ్రీనివాస్ రావు
- October 11, 2023
వరంగల్: ప్రతిఫలం ఆశించకుండా సమాజానికి చేసే నిస్వార్థమైన సేవే అనేక అవార్డులకు సమానమని నిట్ ఉత్తమ అవార్డు గ్రహీత ఐత రాజా శ్రీనివాస్ రావు అన్నారు. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ 65వ స్థాపన దినోత్సవం సందర్భంగా సంఘ సేవ, సామాజిక సేవారంగంలో ఐత రాజా శ్రీనివాస్‌రావుకు అవార్డు ప్రదాన కార్యక్రమం మంగళవారం నిట్ క్యాంపస్‌లో జరిగింది. హన్మకొండకు చెందిన రాజా శ్రీనివాస్ రావు నిట్ క్యాంపస్‌లో చదువును పూర్తి చేసుకుని, ప్రస్తుతం అబుధాబిలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సమాజం తనకేమి ఇచ్చిందనేది కాకుండా సమాజానికి తానేమిస్తున్నాననే సామాజిక సృహతో అనేక మందికి రాజా శ్రీనివాస్ రావు సేవలందిస్తున్నారు. ఇండియాతోపాటు, అబుధాబిలోని భారతీయులకు ఆర్థిక పరంగా, వైద్య పరంగా, వీసా సమస్యల పరంగా ఎదురైన ఇబ్బందులకు తనవంతుగా ఆయన సేవలందిస్తున్నారు. తెలంగాణలోని పేద రైతులను ఆదుకోవాలనే గొప్ప లక్ష్యంతో తాను స్వయంగా స్థాపించిన రైతు బాంధవ చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నారు. అబుధాబిలోని తెలుగువారితో కలిసి భారతీయ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాలను గౌరవిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణలో శ్రీనివాస్ రావు క్రీయాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు.
నాన్న స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు
ఈ సందర్భంగా రాజా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తనకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా, నిట్ ఉద్యోగిగా పనిచేస్తూ, తన ఎదుగుదలకు ఎంతగానో కృషిచేసిన తన తండ్రి మోహన్‌రావు భౌతికంగా లేకపోవడాన్ని గుర్తు చేసుకుని రాజా శ్రీనివాస్ రావు భావోద్వేగానికి గురయ్యారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజానికి సేవ చేయాలనే ఆలోచనకు స్ఫూర్తి తన తండ్రిగారేనన్నారు. సంఘ సేవ, సామాజిక సేవా రంగంలో నిట్ తనకు ప్రదానం చేసిన అవార్డు తన తండ్రికే అంకితమన్నారు. కాగా, రాజా శ్రీనివాస్ రావును గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అల్లం రాజేశ్ వర్మ, సీనియర్ జర్నలిస్ట్, ఆయుధం పత్రిక ఎడిషన్ ఇన్చార్జి అనుముల ప్రభాకర్, నిట్ అధ్యాపకులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







