'IOWave23'లో పాల్గొన్న ఒమన్

- October 12, 2023 , by Maagulf
\'IOWave23\'లో పాల్గొన్న ఒమన్

మస్కట్: హిందూ మహాసముద్రంలో సునామీల ప్రమాదానికి వ్యతిరేకంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థ యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి, మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రాంతీయ వ్యాయామం “IOWave23”లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంది. హిందూ మహాసముద్రంను ఆనుకుని ఉన్న దేశాల్లోని ప్రాంతీయ, జాతీయ కేంద్రాల్లో ఈ డ్రిల్ జరిగింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA), సమాచార మంత్రిత్వ శాఖ, రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ద్వారా డ్రిల్‌లో ఒమన్ సుల్తానేట్ ప్రాతినిధ్యం వహించారు. ఇంకా డ్రిల్ సునామీ హెచ్చరికలను స్వీకరించడంలో సంసిద్ధతను పరీక్షించడానికి , సమాజంలోని ప్రజలందరూ హెచ్చరించబడతారని హామీ ఇవ్వడానికి, అలాగే సునామీ దృశ్యాలను నిర్వహించడానికి ఒక అవకాశంగా పరిగణించబడుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com