వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ సినిమా..
- May 23, 2016
అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్, తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన అఖిల్ సినిమా అక్కినేని అభిమానులను అలరించలేకపోయింది. దీంతో తన రెండో సినిమా విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు ఈ యువ హీరో. ఇప్పటికే అఖిల్ రెండో సినిమా రేసులో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా నాగార్జునకు ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ సినిమా ఉంటుదన్న టాక్ బలంగా వినిపించింది.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ఏ జవానీ హై దివానీ' సినిమాను తెలుగు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. ఈ సినిమాను వంశీ దర్శకత్వంలో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. తాజాగా అఖిల్ సినిమా రేసులో మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఇటీవల కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న హను రాఘవపూడి, అఖిల్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట.ప్రస్తుతానికి వంశీ పైడిపల్లి సినిమాను పక్కన పెట్టి హను సినిమానే ముందుగా సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి హనురాఘవపూడి సినిమా అయినా సెట్స్ మీదకు వస్తుందో..? లేక.. మరోసారి అవన్ని గాసిప్స్ అంటూ అక్కినేని హీరోలు కొట్టిపారేస్తారో...? చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







