ప్రసిద్ధ యూఏఈ డూన్ మూసివేత
- November 20, 2023
యూఏఈ: ఎమిరేట్ సెంట్రల్ ప్రాంతంలోని అల్ ఫయా దిబ్బల ప్రాంతాన్ని అధికారికంగా మూసివేయాలని షార్జా పోలీసులు నిర్ణయించారు. నవంబర్ 17( శుక్రవారం) సాయంత్రం అల్ ఫయా ఎడారిలో ఆఫ్-రోడింగ్ ప్రమాదంలో ఒక ఆసియా యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన ఆఫ్-రోడింగ్ కార్యకలాపాలలో పాల్గొనడం వాహనదారులు, వారితో పాటు వచ్చే కుటుంబాలు లేదా వ్యక్తుల జీవితాలకు ప్రమాదం కలిగిస్తుందని హెచ్చరించారు.
యూఏఈ జాతీయ, దుబాయ్ ఆఫ్‌రోడర్స్ డెసర్ట్ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సీనియర్ మార్షల్ అబ్దుల్లా ముహమ్మద్ అల్‌బ్లౌషి మాట్లాడుతూ.. ఒంటరిగా రైడ్ కు వెళ్లవద్దని సలహా ఇచ్చారు. ఆఫ్-రోడింగ్‌కు వెళ్లే ముందు పర్వతాలకు లేదా ఎడారులకు వెళ్లే ముందు ప్రజలు సరైన భద్రతా పరికరాలను కలిగి ఉండేలా చూసుకోవాలన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







