మనామా డైలాగ్‌.. ప్రాంతీయ రక్షణ వ్యూహాలపై కీలక చర్చ

- November 20, 2023 , by Maagulf
మనామా డైలాగ్‌.. ప్రాంతీయ రక్షణ వ్యూహాలపై కీలక చర్చ

బహ్రెయిన్: ఐఐఎస్ఎస్ మనామా డైలాగ్‌లోని మూడవ ప్యానెల్ ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన సామర్థ్యాలు, వ్యూహాలపై దృష్టి సారించింది. ఐఐఎస్ఎస్ డైరెక్టర్ జనరల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ బాస్టియన్ గీగెరిచ్ మాట్లాడుతూ.. సమర్థవంతమైన రక్షణ వ్యూహాలను, ప్రస్తుత మరియు భవిష్యత్తు సాయుధ దళాలకు సామర్థ్యాల అభివృద్ధి ఆవశ్యకతను వివరించారు.   సౌదీ అరేబియా కార్యనిర్వాహక వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఖలీద్ అల్ బియారీ మాట్లాడుతూ.. 2030 కోసం సైనిక అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు. "సౌదీ అరేబియా తన సైనిక దళాల భద్రతకు హామీ ఇవ్వడానికి అతిపెద్ద అభివృద్ధి ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించింది. 2030 నాటికి మేము మా ఖర్చులలో 50 శాతానికి పైగా మిలిటరీకి కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.’’ అని పేర్కొన్నారు. NATOలోని మిలిటరీ కమిటీ చైర్ అడ్మిరల్ రాబ్ బాయర్ అభివృద్ధి చెందుతున్న ప్రపంచ భద్రతా, బలమైన భాగస్వామ్యాల ఆవశ్యకత గురించి చర్చించారు. రష్యా దూకుడును అడ్డుకునేందుకు తమ రక్షణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు.. ఒక బిలియన్ ప్రజలను రక్షించడానికి, తాము మా భాగస్వాములతో ఎక్కువ సమయం, శక్తిని పెట్టుబడి పెట్టాల్సి ఉందన్నారు.  యూకే డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ సర్ టోనీ రాడాకిన్, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాలో పరిస్థితిని ప్రస్తావించారు.  రాయల్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల ఈజిప్ట్‌లోని పాలస్తీనియన్ పౌరులకు 21 టన్నుల సహాయాన్ని ఆక్రమిత భూభాగానికి £30 మిలియన్ల మానవతా మద్దతులో భాగంగా పంపించినట్లు పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com