సముద్రంలో కుప్పకూలిన అమెరికా సైనిక విమానం
- November 29, 2023
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన సైనిక విమానం జపాన్ సముద్రంలో కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.47 గంటలకు విమానం కూలిపోయినట్టు అక్కడున్న మత్స్యకారులు గుర్తించారు. వెంటనే కోస్ట్ గార్డ్స్ కు సమాచారం అందించారు. జపాన్ లోని యకుషిమా దీవి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. విమానం కుప్పకూలిన విషయాన్ని కోస్ట్ గార్డ్స్ ధ్రువీకరించారు. మరోవైపు విమానం ఎడమ ఇంజిన్ మండిపోతూ సముద్రంలో పడిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై అమెరికా డిఫెన్స్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు విమానంలో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియరాలేదు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









