ఏపీలో ఎస్సై పరీక్ష ఫలితాల విడుదల
- December 07, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మెయిన్ పరీక్ష తుది ఆన్సర్ కీని కూడా బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు తమ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఏపీ వ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షకు మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 19న జరిగిన ప్రాథమిక రాత పరీక్షకు 1,51,288 మంది హాజరవగా వారిలో 57,923మంది క్వాలిఫై అయ్యారు. అనంతరం జరిగిన దేహదారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయిన 31,193 మంది అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహించి తాజాగా ఫలితాలను విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







