తెలంగాణ: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నది వీరే..
- December 07, 2023
హైదరాబాద్: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది ఎవరనే విషయంపై ఉత్కంఠ వీడింది. 11మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి వారికి స్వయంగా ఫోన్లు చేసినట్లు సమాచారం. తెలంగాణ రాజ్ భవన్ కు మంత్రులు జాబితాను పంపించారు. మధ్యాహ్నం రేవంత్ తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారిలో..
ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, దామోదర రాజనర్శింహ, జూపల్లి కృష్ణారావులు ఉన్నారు.
డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..
ముందుగా అనుకున్నట్లుగానే డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తొలుత ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేందుకు మొగ్గుచూపింది. ఈ క్రమంలో భట్టి విక్రమార్క, సీతక్క పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, గత రెండు రోజులుగా ఢిల్లీలో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్ర నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. మంత్రి వర్గం కూర్పు, డిప్యూటీ సీఎంల తదితర విషయాలపై చర్చించారు. ఈ క్రమంలో కేవలం ఒక్కరికి మాత్రమే డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు.
ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ..
ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మంత్రులుగాతుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు క్యాబినెట్ లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ హయాంలలో మంత్రిగా పనిచేశారు. భట్టి విక్రమార్క గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నల్గొండ జిల్లాలో ముందుగా ఊహించినట్లుగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిద్దరికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖలకు మంత్రులుగా అవకాశం దక్కింది. గతంలో కొండా సురేఖకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సీతక్క తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కరీనంగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం దక్కింది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాజనర్సిహ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







