త్వరలో 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
- December 12, 2023
న్యూ ఢిల్లీ: దేశంలో రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వెల్లడించింది. దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచనున్నారు. భారతీయ రైల్వే దేశంలో కొత్తగా పది వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ – పూణే మార్గంలో కొత్తగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును త్వరలో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-పూణే మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-పూణే వందేభారత్ రైలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే రెండు తెలుగు రాష్ట్రాల్ోల నాలుగు వందేభారత్ రైళ్లను నడుపుతోంది. వందేభారత్ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతుండటంతో వీటి సంఖ్యను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే అన్ని వర్గాల ప్రయాణికులకు సౌకర్యం ఏర్పడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు మొత్తం 33 రైళ్లు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 33 వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాలు,రాష్ట్రాల మధ్య నడుస్తున్నాయి. వందే భారత్ రైళ్లలో ఇప్పటి వరకు ఏ ఇతర రైళ్లలోనూ లేని కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉండడం వల్ల వీటి ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. ఈ రైళ్లకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు అందుబాటులో ఉండే సేవలను విస్తరించాలని నిర్ణయించింది.
సికింద్రాబాద్-పూణే వందేభారత్ రైలుతోపాటు, వరణాసి-లక్నో, పాట్నా-జల్పాయిగురి, మడ్గావ్-మంగళూరు, ఢిల్లీ-అమృతసర్, ఇండోర్-సూరత్, ముంబయి-కొల్హాపూర్, ముంబయి-జల్నా, పూణే-వడోదర, టాటానగర్-వరణాసి సెక్షన్ల మధ్య కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వేశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం







