లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- June 29, 2026
దోహా: లూసైల్ ట్రామ్ నెట్‌వర్క్‌లోని కొన్ని 'అట్-గ్రేడ్' స్టేషన్లు తాత్కాలికంగా మూసివేయబడిన నేపథ్యంలో ప్రభావితమైన ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త మెట్రోలింక్ మార్గాలను ప్రకటించారు. 'రౌదత్ లూసైల్' (Rawdat Lusail) ప్రాంతానికి కొత్తగా 'M154' మెట్రోలింక్ మార్గాన్ని ప్రవేశపెడుతున్నట్లు దోహా మెట్రో తెలిపింది.
ఈ కొత్త మార్గం, తాత్కాలికంగా నిలిపివేయబడిన ట్రామ్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది.ప్రభావితమైన స్టేషన్లలో లూసైల్ స్టేడియం, అల్ ఖైల్ స్ట్రీట్, రౌదత్ లూసైల్, డౌన్‌టౌన్ లూసైల్, ఫాక్స్ హిల్స్ నార్త్, అల్ యాస్మీన్, సీఫ్ లూసైల్ నార్త్, క్రెసెంట్ పార్క్ నార్త్ మరియు ఎర్కియా (Erkiyah) ఉన్నాయని పేర్కొంది. వీరికి 'M154' మెట్రోలింక్ రూట్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







