వైసీపీ మునిగిపోతున్న నావ: ఎపిసిసి అధ్యక్షుడు రుద్రరాజు
- December 12, 2023
అమరావతి: వైసీపీలో రాజీనామాలపై ఎపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 10టీవీతో రుద్రరాజు మాట్లాడుతూ..వైసీపీ మునిగిపోతున్న నావా అని ప్రజలకు ఇప్పటికే అర్ధమైపోయింది అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రజలు కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారని..‘కాంగ్రెస్ రావాలి..మార్పు రావాలి’ అనే నినాదంతో కర్ణాటక, తెలంగాణాలో మాదిరి ప్రజల్లోకి వెల్తామని తెలిపారు.నిన్నటి నుంచే వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైందని..విశాఖతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేల, మాజీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలకు సిద్ధపడుతున్నారని అన్నారు. అంతేకాదు వివిధ విభాగాల ఇన్ చార్జిలు తనతో టచ్ లో ఉన్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్లినవారు తిరిగి తమ సొంతపార్టీలోకి రావాలనుకుంటున్నారని అన్నారు.
అనుకోని కారణాల వలన కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ చెంతకు చేరినవారు అంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావటానికి రెడీగా ఉన్నారని అన్నారు. తనతో ఇప్పటికే 15 మంది టచ్ లో ఉన్నారని తెలిపారు. వారితో తాను మాట్లాడానని..రేపటింనుంచే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.వైఎస్ షర్మిల ఏపీకి వస్తే స్వాగతిస్తానన్నారు.జగనన్న సంధించిన బాణం ఎటువైపు వెల్తారో చూడాలని అన్నారు. వైసీపీతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా పలువురు నేతలు తనతో టచ్ లో ఉన్నారని తెలిపారు.
2024లో కాంగ్రెస్ కు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రేపు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నామని..ఎఐసిసి నేతలతో పాటు ఏపీ సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.రేపటి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. జనవరిలో మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఏపీకి వస్తారని తెలిపారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయని తెలిపారు.
కాగా..గతంలో కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పార్టీకి రెబల్ గా మారిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇలా వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేస్తు..వైసీపీ మునిగిపోతున్న నావ అంటూ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







