అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మార్పు
- December 28, 2023
అయోధ్య: జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రైల్వే స్టేషన్ పేరును 'అయోధ్య ధామ్'గా మార్చింది. 22న జరగనున్న అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6వేల మందికి పైగా అతిథులు హాజరుకానున్నారు.
ఈ నెల 30న ప్రధాని మోదీ అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. రోడ్ షో అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. అదే రోజు అయోధ్య రైల్వే స్టేషన్‌లో కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ భవనంలో విమానాశ్రయంలో ఉన్నటువంటి సౌకర్యాలు లభిస్తాయి. సంప్రదాయ ఆలయ ఆర్కిటెక్చర్ స్ఫూర్తితో ఈ భవనాన్ని నిర్మించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..