విదేశాల్లో 'అయోధ్య' ప్రత్యక్ష ప్రసారాలు
- January 14, 2024
అమెరికా: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరపనున్న నేపథ్యంలో అమెరికాలోని పదికిపైగా రాష్ట్రాలలో రామమందిరానికి సంబంధించిన భారీ బిల్‌బోర్డులను 40కిపైగా ఏర్పాటు చేస్తున్నట్టు వీహెచ్‌పీ-అమెరికా ప్రధానకార్యదర్శి అమితాబ్ వీడబ్ల్యూ మిత్తల్ తెలిపారు.
ఇప్పటికే టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ, జార్జియా రాష్ట్రాలలో ఈ బోర్డులను ఏర్పా టు చేసినట్టు చెప్పారు. అరిజోనా, మిస్సోరీ రాష్ట్రాలలో ఈనెల 15వ తేదీన రామమందిర బిల్‌బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అమెరికాలోని హిందువులు భారీ కారు ర్యాలీలు నిర్వహించారు. అలాగే, ఆఫ్రికా ఖండంలోని మారిషస్ దేశంలో హిందువులైన ఉద్యోగులు ఈనెల 22న పూజల్లో పాల్గొనేందుకు రెండు గంటలు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు ఆ దేశ కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.
2011 జనాభా లెక్కల ప్రకారం మారిషస్ జనాభాలో హిందువులు దాదాపు 48.5 శాతం ఉన్నారు. కాగా, ఆ దేశ జనాభాలో 68ువరకు భారత సంతతికి చెందినవారే. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో వచ్చే 10 రోజులు మారిష్‌సలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మారిషస్ సనాతన ధర్మ టెంపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఘూర్బిన్ భోజ్‌రాజ్ తెలిపారు. వీధుల్లో ర్యాలీలు, చారిత్రక, ముఖ్యమైన భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించడంతోపాటు ముఖ్యమైన కూడళ్లలో ఎల్సీడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసి మందిర ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు చెప్పారు. ఈనెల 22న అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ రామాలయ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు మారిషస్ సీనియర్ మంత్రి అంజివ్ రామ్ధన్య చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రమిదలు కూడా వెలిగించనున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







