ఘోర అగ్నిప్రమాదం.13 మంది విద్యార్థుల సజీవ దహనం
- January 20, 2024
బీజింగ్: చైనాలోని హెనాన్ ప్రావిన్సులో విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్ వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. యన్షాన్పు గ్రామంలోని యింగ్‌కై స్కూల్‌లో జరిగిందీ ఘటన. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్కూలుకు చేరుకుని మంటలు అదుపు చేశారు. మంటల్లో చిక్కుకున్న 13 మంది విద్యార్థులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్టు స్థానిక పత్రికలు తెలిపాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







