రేవంత్ ఇంటికి చేరిన సస్పెండ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు
- January 24, 2024
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గతంలో సస్పెండ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు బారులు తీరారు. సీఎను కలిసేందుకు వారంతా పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. చిన్న చిన్న కారణాలతో గత సర్కార్ తమను ఉద్యోగాల్లో నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం తొలగించిన దాదాపు 1500 మంది ఉద్యోగులు సీఎం ఇంటి వద్దకు తరలిరాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారి గోడు విన్న అధికారులు ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి అనుమతి ఇచ్చారు. సస్పెండ్, మెమో, జీతాలు కట్ చేయడం ఇలా చిన్న చిన్న కారణాలతో 15 వందల మందిని ఉద్యోగాల నుంచి తీసివేశారని సీఎంను కలిసి వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







